Advertisement

నిరుపేద కుటుంబాలకు అండగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 05 : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు, కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ ల ఆశయాలకు అనుగుణంగా జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాకినాడ జగన్నాధపురంలోని 14వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన కర్రి చిన్న కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందని తెలుసుకున్న జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) వారి కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. ఇప్పటి వరకు 304 మందికి తన శక్తి మేరకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) మాట్లాడుతూ పది మందికి సేవ చేయడంలో వచ్చే తృప్తి తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. కాకినాడ పట్టణంలోనే కాక, పిఠాపురం, కాకినాడ రూరల్, అలాగే కాకినాడ జిల్లాలో ఎక్కడైనా ఆపదలో ఉంటే తనకు తెలిసిన మరుక్షణం స్పందించి, తనవంతు సహాయం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు పొన్నాడ నాగేశ్వరరావు, జనసేన పార్టీ వీర మహిళలు బంటు లీల, రచ్చ ధనలక్ష్మి, మోనా, సుజాత, దీప్తి, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *