Advertisement

విద్యుత్ స్తంభాల మార్పు పనులు వేగంగా పూర్తిచేయాలి

– కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

కొత్తపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 07 : రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపడుతున్న విద్యుత్ స్తంభాల మార్పు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. వాడపాలెం – కొత్తపేట రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాల మార్పు (లైన్ షిఫ్టింగ్) పనులకు శుక్రవారం ఆయన, కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నూతన స్తంభం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *