– బాలికోన్నత పాఠశాలలో గీతాలాపన చేసిన బిజెపి నాయకులు
మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 07 : వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండపేట బాలికోన్నత పాఠశాలలో బిజెపి నాయకులు ఆధ్వర్యంలో ఆనాడు వందేమాత గేయ రచయిత బకింగ్ చంద్ర చటర్జీ ఉపాధ్యాయ దేశంలో శాంతియుతం స్వాతంత్రం రావలనే ఉద్దేశ్యంతో ఆ పాఠను రచిచడం జరిగిందన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75సం॥లు పూర్తి అగుచున్న కూడా మనలో ఐఖ్యత కోరవడిందనేది మన దేశ ప్రజలను ఐక్య పరచడం కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి పిలుపును ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. శుక్రవారం బాలికోన్నత పాఠశాలలో బిజెపి నాయకులు పాల్గొని గీతాలాపన చేశారు. బాలబాలికలతో కలసి ఐక్యతను చాటి మన దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలని అన్నారు. ఈనాటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశ్యంతో బాలలికలలో దేశం పట్ల గౌరవాన్ని, ప్రేమను ప్రేరేణ కల్పించడం కోసం ఆనాడు గాంధీ మహాత్ముడు స్వదేశీ వస్తువులనే వాడిండి వీదేశీ వస్తువలను బహిష్కరించండి అని చెప్పని వాక్యన్ని కూడా ఈనాడు ఆత్మ నిర్మల్ భారత్లో భాగంగా దేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను వాడడం వలన మన దేశ ఆర్ధిక అభివృద్ధి జరుగుతుందని, అలాగే ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలగుతామని తెలిపారు. మన పొరుగు దేశం జపాన్ ప్రపంచయుద్ధంలో నాసినమై 20సం॥లలో అని తక్కువ సమయంలోనే ప్రపంచంలో టెక్నాజీలో 2వ స్థానంలో ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలని దేశప్రజలకు ఆయన పిలుపును ఇచ్చారు. మన పాలకులు చేసి తప్పిదాలను సరిదిద్దుతూ దేశప్రజలను ఐక్యతగా ఉంటే ఎంతటి విత్కర పరిస్థితులైనా ఎదుర్కోవచ్చని అలాగే కరోనా కలంలో ప్రజల ఐక్యత వలనే మరణాల సంఖ్యను తగ్గించగలిగామని, ఆపరేషన్ సిందూర్ను కూడా విజయవంతం చేయగలిగామని, యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ఘనత మోడీకే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఈఒ మరియు పట్టణ పట్టణ అధ్యక్షడు నాళం ఫణిప్రకాష్, బిజెపి సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ, కోటిపల్లి సాయిరామ్, గొడవర్తి రామచంద్రరావు, పట్టణ ప్రదానకార్యదర్శి కోటిపల్లి కృష్ణమాచార్యులు, బండారు సూరిబాబు, పట్టణ మాజీ అధ్యక్షుడు మద్దుల సుబ్బారావు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply