Advertisement

అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్

  • ఈవారం అన్నా క్యాంటీన్ దాత కీర్తిశేషులు స్వర్గీయ బొజ్జపు మాధవరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు బొజ్జపు శ్రీనివాస్

జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 10 : జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆశీస్సులతో దాతల సహకారంతో ప్రతి సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ఉచిత అన్నా క్యాంటీన్ కు సోమవారం ఆర్థిక సహాయం అందించిన దాత కిర్లంపూడి మండలం శృంగరాయుని పాలెం గ్రామానికి చెందిన కీర్తిశేషులు స్వర్గీయబొజ్జపు మాధవరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు బొజ్జపు శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఉచిత అన్న క్యాంటీన్ కు కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకే టిడిపి ఆవిర్భవించిందని 44 సంవత్సరాలుగా ప్రజలకు అన్ని విధాల అండగా ఉందని, జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నాలుగున్నర సంవత్సరాలుగా ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, జగ్గంపేటలో ప్రభుత్వ అన్న క్యాంటీన్ భవనం పూర్తయిందని, తొందరలోనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టిడిపి అధ్యక్షుడు జీను మణిబాబు, రాష్ట్ర ఆర్యవైశ్య కొత్త కొండబాబు, భూపాలపట్నం ప్రసాద్, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, సర్పంచ్ పట్టు చంటిబాబు, ఎంపీటీసీ గారగా గోవిందు, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి గోడే బాల, మాజీ ఎంపీటీసీ బొజ్జపు నాగేశ్వరరావు, రాయి సాయి, పీలా మహేష్, బద్ది సురేష్, దాపర్తి సీతారామయ్య, యల్లమిల్లి సీఎం, కోడూరి రమేష్, మారిశెట్టి గంగ, ఎండి కాజా, మాజీ ఎంపీటీసీ అల్లుమల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *