Advertisement

ఇళ్ళు నిర్మాణం కోసం రుణాలు

ప్రతి పేదవాడికి ఇళ్ళు…కూటమి ప్రభుత్వం లక్ష్యం

మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : గత వైసీపీ హయాంలో వ్యక్తి గత గృహ నిర్మాణ రుణాలు ఇవ్వలేని పరిస్థితి వుంటే కూటమి ప్రభుత్వం సొంత స్తలం వున్న ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. 23వ వార్డు సైదిల్ పేట 2వ వీధిలో గల అమరపల్లి శ్రీనివాస్ కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం (గృహా నిర్మాణ) క్రింద మంజూరు అయిన లబ్దిదారుని ఇంటి స్ధలం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహనిర్మాణం తమ ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. కమీషనర్ టివి రంగారావు, 23వ వార్డు కౌన్సిలర్ ముక్కా లోవలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ 23వ వార్డు టిడిపి ఇంచార్జ్ బొడ్డు రామకృష్ణ, మాజీ కో ఆప్షన్ సభ్యులు జొన్నపల్లి సూర్యారావు, స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ, ఇ.ఇ హౌసింగ్ రమణ, డి.ఇ హౌసింగ్ వెంకట రెడ్డి, హౌసింగ్ ఎఇలు తేజ, వంశీ, దాస్, శ్రీనివాస్ రెడ్డి, ఏమినిటీస్ సెక్రటరీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *