నేటి బాలలే రేపటి పౌరులు
సమ సమాజ నిర్మాణ స్థాపనలో నేటి బాలలే ముఖ్య పాత్ర
మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : నేటి బాలలే రేపటి పౌరులు అన్న జవహర్ లాల్ నెహ్రు వాక్కు అక్షర సత్యమని మండపేట అక్షర స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ వంక రాంబాబు (విజ్ఞాన్ రాంబాబు), బొప్పన వెంకట్రావు పేర్కొన్నారు. మండపేట గొల్లపుంత రోడ్డు అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం స్కూల్ డైరెక్టర్ విజ్ఞాన్ రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షర స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ రాంబాబు, బొప్పన వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ భారత దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు అని అన్నారు. ముందుగా జవహర్లాల్ నెహ్రు చిత్ర పటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమ సమాజ నిర్మాణ స్థాపనలో వారిదే ముఖ్య పాత్ర అన్నారు. అటు చదువులోను ఇటు సామజిక అంశాలలోను ఎప్పటి కప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలచుకోవాలని విజ్ఞాన్ రాంబాబు పేర్కొన్నారు. బాలల దినోత్సవ పేరిట విద్యార్థుల్లో శరీర దారుడ్యాన్ని పెంపొందించే దిశగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించి, వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు అతిధులు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులలో సృజనకు అద్దం పట్టేలా దేశభక్తి గేయాలు, దృశ్య రూపకాలు, సందేశాత్మక నాటికలలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆహూతులను అలరించారు. ముఖ్యంగా తెలుగు భాష వైభవం ఉట్టిపడేలా సుమతీ శతకం, వేమన శతకం, దాశరధి శతకం పద్యాలు చిన్నారులు వల్లె వేసిన తీరు ఆహుతులు అలరించింది. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
















Leave a Reply