Advertisement

అక్షర తపస్వి – భాను తేజశ్రీ

అక్షరాలే ఆభరణాలుగా అలంకరించుకున్న వనిత,

భావాల లోతుల్లోంచి కొత్త అర్థాలను వెలికితీసే సృజనశీలి.

భాను‘డి కిరణంలా తన పదాలతో వెలుగులు నింపుతూ,

తేజ‘స్సుతో నిండిన కలమే తన నిరంతర చిరునామా.

కవిత్వపు తోటలో విరిసిన అరుదైన పారిజాతం,

ఆమె రాసే ప్రతి వాక్యం ఒక మధురమైన కావ్యం.

భాషకు ప్రాణం పోస్తూ, భావాలకు రూపం ఇస్తూ,

పాఠకుల గుండెల్లో చెరగని ముద్ర వేసే అక్షర యాత్రికురాలు.

పోలగాని‘ వంశపు కీర్తి కిరీటమై నిలుస్తూ,

ఆడపడచు చైతన్యానికి నిలువుటద్దమై నిలుస్తోంది.

తన కలం నుంచి జాలువారే ప్రతి అక్షరం ఒక చైతన్యం,

సాహితీ లోకంలో ఆమె ప్రయాణం ఎన్నటికీ అనంతం.

  • Sky Writings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *