Advertisement

పిఠాపురం శాంతిభద్రతలకు ఎన్ఆర్ఐ సేవాభావి డా. దివ్య సునీత రాజ్ నుండి బొలెరో వాహనం విరాళం

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 17 : పిఠాపురం ప్రాంతంలో శాంతి భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి నియో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & షీ ఫౌండేషన్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ సేవాభావి డా. దివ్య సునీత రాజ్ ఒక మహీంద్రా బొలెరో వాహనాన్ని పిఠాపురం పోలీసులకు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కాకినాడ కలెక్టర్ శ్యాన్మోహన్ సగిలి పాల్గొని, జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాన్మోహన్ సగిలి మాట్లాడుతూ డా. దివ్య సునీత రాజ్ పిఠాపురం ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చేసిన సహాయక కార్యక్రమాలు, వరద బాధితులకు అందించిన నిత్యావసర వస్తువులు, గ్రామాల్లో తాగునీటి క్లోరినేషన్ యూనిట్ల ఏర్పాటు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి పలు సేవలు ఆమె సామాజిక నిబద్ధతకు నిదర్శనమన్నారు.

డా. దివ్య సునీత రాజ్ మాట్లాడుతూ వరాహి యాత్ర సందర్భంగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన “సమాజ శాంతి భద్రతలను పటిష్ఠం చేయాలి” అనే పిలుపు తనను ప్రేరేపించిందని తెలిపారు. ప్రజల భద్రత కొరకు బొలెరో వాహన విరాళం చిన్న భాగమైనప్పటికీ, సమాజానికి సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి4 కార్యక్రమం కింద మల్లం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం, కాకినాడ కలెక్టరేట్ & పిఠాపురం పాడాలతో కలిసి 25,000 కుటుంబాలకు మెగా దంత ఆరోగ్య సర్వే మరియు చికిత్స కార్యక్రమం నిర్వహించడం వంటి సేవలతో ప్రజాప్రయోజనాల పట్ల తన అంకితభావాన్ని నిరూపించుకున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఈ వాహనం పిఠాపురం ప్రాంతంలో పెట్రోలింగ్, అత్యవసర స్పందన, ప్రజల రక్షణ చర్యలు మరింత వేగవంతం కావడానికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బి డిఎస్‌పి సత్యనారాయణ, పెద్దాపురం డిఎస్‌పి శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *