– మురారిలో జగ్గంపేట నియోజకవర్గం రెండో విడత రైతులకు నిధులు విడుదల
జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 19 : జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామంలోని కాకతీయ ఫంక్షన్ హాల్ లో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో జగ్గంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ ప్రారంభించారు. రైతులు పండించే పంటకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం – పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందని వారు అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక భరోసాని ఇస్తుందని అన్నారు.
అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులు, కూటమి నాయకులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు. ఈ సందర్భంగాపోతుల మోహనరావు, తుమ్మలపల్లి రమేష్, అడపా భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ సాగు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి, భూమి సాగు చేసుకునే కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, పిఎం కిసాన్ పథకం ద్వారా రూ.6 వేలు ఆర్థిక సహాయం రైతులకు అందజేస్తున్నామని అన్నారు. అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో మొదటి విడత 30.371, రెండవ విడత 30820 మంది మొత్తం61,191 రైతులకు రైతులకుగానూ 41 కోట్ల 21 లక్షలు నిధులు జమ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడు విడతలలో రైతులకు రూ.20 వేలు అందజేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అన్నదాత కుటుంబాల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో జగ్గంపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. సంక్షేమం అభివృద్ధి పనులు చేపడుతూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తోట రవి, అడబాల భాస్కరరావు, బస్వా వీరబాబు, జాస్తి వసంత్, పైడిపాల సూరిబాబు, తోట గాంధీ, కంటిపూడి సత్యనారాయణ, చావా చౌదరి, కందుల కొండయ్య చౌదరి (బాబ్జి) దాపర్తి సీతారామయ్య, కూటమి నాయకులు, కార్యకర్తలు, గండేపల్లి జగ్గంపేట కిర్లంపూడి గోకవరం వ్యవసాయ అధికారులు, జగ్గంపేట ఉద్యాన అధికారిని, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply