తాళ్ళరేవు, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 06 : తాళ్ళరేవు మండలంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో అంబేడ్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జెల్లావారి పేట అంబేడ్కర్ యువజన సంఘం వారు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తర్వాత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్స్, ఆసుపత్రి సిబ్బంది అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాకపల్లి చిరంజీవి అంబేడ్కర్ జీవిత విశేషాలు, ఆయన చేసిన త్యాగాలు, ఉద్యమాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి వినోద్, వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, రోళ్ళ చక్రవర్తి, అత్తిలి బాబురావు, ఎం.నారాయణ రావు, దడాల పెద సత్యనారాయణ, ఎలిపే నాగేశ్వరరావు, రేవు నాగేశ్వరరావు, ప్రసాద్ బాబు, డి.బుజ్జిబాబు, వి.రాజబాబు, టి.ఈశ్వర రావు, ఈశ్వరి బాయి, ఎం.బైరవమూర్తి, నల్లి ఈశ్వరరావు, కే.వెంకటరమణ, కే.శ్రీను, వి.శ్రీను, స్థానిక నాయకులు, మహిళా సంఘాలు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కు నివాళులర్పించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కు ఘన నివాళులు అర్పించిన ఆసుపత్రి సిబ్బంది













Leave a Reply