పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 08 : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ, ఎండపల్లి గ్రామాలలో రబీ పంటకు ఆకుమడులు సిద్ధం చేసుకుంటున్న రైతులను కలిసి నీటి లభ్యత తెలుసుకుని, వంతులవారి నీటి వినియోగంలో పలు సూచనలు గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ అందిచారు. నీటి సరఫరా పెంచాలని మాధాపురం, కొత్తపల్లి, కొమరగిరి గ్రామల రైతులు తెలియచేయగా సంభందిత నీటి సంగం అధ్యక్షులతో చర్చించి, నీటి ఎద్దడి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చిత్రాడ నీటిసంగం అధ్యక్షుడు బసవ సత్తిబాబు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, చిత్రాడ జనసేన నాయకులు దేసినీడి సతీష్, కుక్కల బాబు, ఎండపల్లి నీటిసంగం మెంబర్లు, జనసేన నాయకులు గుండ్ర జగ్గారావు, మత్సా శ్రీనివాసరావు, గుండ్ర కిశోర్, గుండ్ర బాబ్జి, రైతులు పాల్గొన్నారు. రైతులు నీటి అవసరాలకు పిఠాపురం డెల్టా చైర్మన్ కార్యాలయం నెంబర్ కు 9515366262 ఏ సమయంలో అయినా సంప్రదించవచ్చు అని తెలియజేసారు.
రబీ ఆకుమడులకు నీటి లభ్యత పై రైతులను కలిసిన డెల్టా చైర్మన్ మురాలశెట్టి













Leave a Reply