జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి డిసెంబర్ 08 : పాఠశాల విద్యాభివృద్ధిలోనూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలలోనూ విశిష్టమైన సేవలు అందించిన అప్పారావు మాస్టారు నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని శ్రీ సత్యసాయిసేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ గోవిందరాజులు అన్నారు. సోమవారం జగ్గంపేట టీచర్స్ కాలనీలో శ్రీ సత్యసాయి బాలవికాస్ గురువు, విశ్రాంత ఉపాధ్యాయుడు మండపాక అప్పారావు మాస్టారు సంస్మరణ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. అంకితభావంతోను, చిత్తశుద్ధితో రామవరం, జొన్నాడ, బూరుగుపూడి గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది, బాలవికాస్ గురువుగా నైతిక విలువలు నేర్పిన అప్పారావు మాస్టారు సేవలు ఎప్పుడూ మరువలేమని, నేటి సమాజానికి ఆయన మృతి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు, తుని సబ్ జోన్ కన్వీనర్ తుమ్మలపల్లి జోగేంద్రనాధ్, కాకినాడ జిల్లా మహిళా సేవాదళ్ సమన్వయకర్త తుమ్మలపల్లి చిట్టి కామేశ్వరి(కుమారి), రామవరం సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గట్టిమ్ సుబ్బారావు, సబ్ జోన్ కన్వీనర్ కే.జయబాబు, రాజమహేంద్రవరం సబ్ జోన్ కన్వీనర్ కూసు సుబ్రహ్మణ్యం, బాల్యమిత్రుడు కె.సన్యాసిరావు, సుబ్బారావు మాస్టారు, కోటపాడు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కందర్ప వెంకట అమర్నాథ్, తూర్పుగోదావరి జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త ఎల్.శ్రీనివాసరాజు, మాస్టారు కుమారులు వీరేంద్రబాబు, హరిబాబు, కుమార్తె మంగామణి, కుటుంబ సభ్యులు, తదితరులు అప్పారావు మాస్టారు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఆదర్శప్రాయుడు అప్పారావు మాస్టారు













Leave a Reply