ప్రకాశం జిల్లా, సింహగర్జన ప్రతినిధి (ముత్యాల నరేష్ రెడ్డి) డిసెంబర్ 26 : బాల్యవాహం చట్టరీత్యా నేరమని సీఐ ఎం.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం స్వయంకృషి సేవాసంస్థ అధ్యక్షుడు డాక్టర్ షేక్ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు నిర్వహించడం చట్ట వ్యతిరేకమనే వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయికి, 21 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్న అబ్బాయికి వివాహం చేయడం పూర్తిగా చట్టరీత్యా నేరం అని ఆయన అన్నారు. బాల్య వివాహం చేయించే పూజారి, మౌలానా, చర్చి ఫాదర్ శిక్షార్హులు. పెళ్లి చేసిన ఏ ఇతర మత పెద్దలైనా శిక్షించబడతారన్నారు. బాల్య వివాహాలకు సేవలందించే క్యాటరింగ్ బ్యాండ్ మరియు టెంట్ హౌస్ వ్యక్తులకు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు మరి ఎవరికైనా 2 సంవత్సరాలు వరకు జైలు శిక్ష మరియు రూ.1లక్ష రూపాయల జరిమానా వేయించబడును అన్నారు. బాలవిహాలు జరుగుతున్నట్టు మీ దృష్టికి వస్తే 112, బాలల సంరక్షణ హెల్ప్ లైన్ 18001027222,1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జిలాని భాష తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహం చట్టారీత్యా నేరం – సీఐ ఎం.శ్రీనివాసరావు













Leave a Reply