ప్రకాశం జిల్లా, సింహగర్జన ప్రతినిధి (ముత్యాల నరేష్ రెడ్డి) డిసెంబర్ 26 : ప్రకాశం జిల్లా సి.యస్.పురం మండలము కోవిలంపాడు పంచాయతి శీలంవారిపల్లి గ్రామంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 2తేదీ వరకు విశిష్ట పూజా కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త మరియు విశ్రాంత స్పెషల్ కలెక్టర్ పిడుగు బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ చేయడం జరుగుతుందన్నారు. స్వామి వారికి ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త మరియు విశ్రాంత స్పెషల్ కలెక్టర్ పిడుగు బాబురావు కోరారు.
శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం













Leave a Reply