ప్రకాశం జిల్లా, సింహగర్జన ప్రతినిధి (ముత్యాల నరేష్ రెడ్డి) డిసెంబర్ 26 : శీలంవారిపల్లి గ్రామంలో ప్రతి శనివారం విశ్రాంత స్పెషల్ కలెక్టర్ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త పిడుగు బాబురావు ఆధ్వర్యంలో విశిష్ట పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. శీలంవారిపల్లి గ్రామం నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. వెంకట రంగయ్య, విజయలక్ష్మి దంపతుల కుమారుడైన పోతంశెట్టి రాకేష్ భార్య అమల ఈ అన్న ప్రసాద వితరణకు దాతలుగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు.
విశ్రాంత స్పెషల్ కలెక్టర్ పిడుగు బాబురావు ఆధ్వర్యంలో విశిష్ట పూజలు













Leave a Reply