Advertisement

ప్రజా విజయంతో జనసేన పార్టీలో నూతన ఉత్సాహం

  • పట్టణ అధ్యక్షురాలిగా డా. సిహెచ్.వరలక్ష్మి

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, జనవరి 30 : పిఠాపురం పట్టణంలో జనసేన పార్టీలో నూతన అధ్యాయం లిఖించేందుకు అహర్నిశలు శ్రమించి, విభేదాలను తొలగించి, నాయకత్వాన్ని ఒకే దిశలో నడిపించిన జనసేన యువ నాయకుడు కూరాకుల అరవింద్ కృషికి ఈ విజయం అంకితం అని పిఠాపురం టౌన్ జనసేన పార్టీ శ్రేణులు స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. పట్టణ అధ్యక్షురాలిగా ఎన్నికైన వరలక్ష్మి హాస్పిటల్ అధినేత డా. చిక్కాల వరలక్ష్మికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు పార్టీ శ్రేణులు. ఇది నీతి, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువలతో సాధించిన విజయం అని అందరూ ఆమెను అభినందించారు. నూతన కార్యవర్గంతో కలిసి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పిఠాపురం పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *