నందిగామ, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 02 : మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి పై దాడిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ మద్దుకూరి సాయిబాబు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాలు బయటపడినప్పుడు నియంతలు ఎప్పుడూ హింసకే పాల్పడతారని, ఆంధ్రప్రదేశ్ ను జంగిల్ రాజ్ గా మార్చిన బాబు తిరుమల లడ్డులో జంతువుల కోవు లేదని ల్యాబులు తేల్చడంతో చంద్రబాబు అహం దెబ్బతిందన్నారు. చంద్రబాబును ప్రజలు చిదరించుకుంటున్నారు కనుక అది తట్టుకోలేక డైవర్షన్ కోసమే ఈ కుట్రలు, తప్పడు ప్రచారాలతో ఫ్లెక్సీలు పెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చంద్రబాబు ప్లాన్ అని తెలిపారు. ప్రశ్నించే వారిని అంతం చేయాలనేది చంద్రబాబు పథకం, తనకు సాగిపడే పోలీసు అధికారులకు ముందే చెప్పిన చంద్రబాబు నాలుగు రోజుల్లో నలుగురు కీలక నాయకులపై దాడులు, సిబిఐ చార్జిషీట్ ద్వారా ల్యాబ్ రిపోర్ట్లు బయటకు వచ్చిన తర్వాత భూమన ఇంటికి టీడీపీ గుండాలు, విడుదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు పై వరుసగా దాడులు అయినా ఎక్కడా గట్టి చర్యలు తీసుకోని పోలీసులు వీటికి సంబంధించి ఒక కేసు పెట్టలేదన్నారు. అలాగే అరెస్ట్ కూడా చేయని వైనం. అదే క్రమంలో రెండు మూడు రోజులుగా అంబటి పై దృష్టి పెట్టిన టిడిపి గుండాలు వెనకుండి నడిపించిన చంద్రబాబు ఈ దాడులుకు కర్మ కర్త క్రియ చంద్రబాబే అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే, భర్త దగ్గరుండి హత్యాయత్నానికి దిగారు. కేంద్ర మంత్రి పెమ్మసానికి పాపం హత్యాయత్నం చేసినవారిలో ఆయన అనుచరులు ముందస్తు ప్లాన్‌లో భాగంగానే టీడీపీ గుండాలకు ప్లాన్ వారికి దన్నుగా పోలీసు యంత్రాంగం పోలీసులు ప్రభుత్వానికి సాగిలాపడ్డారు. చట్టాన్ని తుంగలో తొక్కారు. రక్షణ కల్పించవలసిన కనీస బాధ్యతను విస్మరించారన్నారు.
తప్పడు ప్రచారాలను తీవ్రంగా ఖండించిన వైయస్సార్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ













Leave a Reply