- దేశవ్యాప్తంగా మరిన్ని కేంద్రాల విస్తరణకు కార్యచరణ
- ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం
కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 02 : దేశవ్యాప్తంగా యువతకు శిక్షణ ఇప్పించి, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలు'(SIIC) ఏర్పాటు చేస్తుందని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించే ప్రతిపాదన ఉందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖామాత్యులు జయంత్ చౌదరి వెల్లడించారు. ఈ మేరకు ‘స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాల’ పై సోమవారం కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశ మొత్తంగా పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఏడు ‘స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలు’ ఏర్పాటు చేసిందని, ఈ కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణతో పాటు, భాషా శిక్షణ అందిస్తున్నామని, ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 433 మంది వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందినట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో SIIC ఏర్పాటుకు ప్రతిపాదన ఉందని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని కేంద్రమంత్రి జయంతి చౌదరి వెల్లడించినట్లు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు.













Leave a Reply