- పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా
కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 28 : దైనందిన జీవితంలో మానవాళి ఆధ్యాత్మిక ఔషాదం స్వీకరించుట ద్వారా మానవ వికాసం ఏర్పడి, తద్వారా సత్ ఫలితాలు వచ్చి సంసారిక, సామాజిక సమస్యలు పరిష్కారం అగుటయే కాక దేశాభివృద్ధి, విశ్వ శాంతి ఏర్పడునని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అనుగ్రహభాషణ చేశారు.

శనివారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద కవి శేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి 141వ జయంతి సందర్భంగా ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో ప్రముఖ కవి బధరీనాధ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో రిటైర్డ్ ఆర్టీవో రామచంద్ర రావు, రిటైర్డ్ ఎమ్మార్వో గౌరి నాయుడు, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభం, షేక్ ఇబ్రహీం, బలరామ కృష్ణ, వీరభద్రం, తురగా సూర్యారావు, హుస్సేన్ షా తదితరులు అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ 16 యేండ్ల ప్రాయంలోనే బ్రహ్మ విద్యా విలాసం అనే గ్రంధాన్ని రచించి పిన్న వయస్సులోనే బ్రహ్మ జ్ఞానిగా, తత్వ వేత్తగా నిరూపితం చేసుకున్నారన్నారు. నాటి ప్రజలలో జాతీయ స్వాతంత్ర కాంక్షను కాంక్షించారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి పాల్గొన్నారని, కేంద్ర అసెంబ్లీలో ఆలోచనాత్మక, ఆచరణాత్మక ప్రసంగాలు ఇచ్చారు అని ఆలీషా అన్నారు. కవి బద్రీనాధ్ మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ ఆలీషా కవిని అంతర్జాతీయ స్థాయి కవిగా, బహు భాషా కోవిధునిగా, పండిత కవిగా సుప్రతిష్టమాయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, కమిటీ సభ్యులు ఎల్లమాంబ, లక్ష్మి, ప్రభావతి, లక్ష్మి కుమారి, మణి తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply