కూడు పెట్టింది
కాళ్లు జాపింది
కనకమేదంటూ
పండ్లు నమిలింది
ముద్ద నోట్లోకి -పోక ముందేను
కండ్ల నీళ్లెట్టి – గోల పెట్టింది
కంచమూలోనసేయి కడిగాడు
కళ్ళ నీళ్లేమో గొంతు మింగాడు
ఒక్క మాట మాట్లాడకుండాను
వాకిట్ల ఆ యబ్బి కూలబడినాడు
దమ్ము లేదప్ప గాయన
ఒంట్లకంట నిద్రపోయి గెంతకాలమయ్యెనో
కడుపునిండా కూడు తిని ఎన్నేళ్లయ్యెనో
అర్థమే సేసుకోని అర్ధాంగి సేతిలోన
ఆట బొమ్మయి అర్ధాంతరంగా కండ్లు మూసాడు…
రచయిత్రి : పోలగాని భాను తేజశ్రీ













Leave a Reply