Advertisement

పట్టణాన్ని నందనవనంగా మార్చండి : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, జూన్ 04 : ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటండి, పిఠాపురం పట్టణాన్ని నందనవనంగా మార్చండి అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేసారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం ఎస్.వి.వి.పి హౌసింగ్ సొసైటీ ఆవరణలో పండూరు మామిడి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అధ్యక్షత వహించగా, పిఠాపురం పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరామ కృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శివరామ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మొక్కలు ద్వారా పర్యావరణ కాలుష్యం నివారణకు అవిశ్రాంతంగా డాక్టర్ ఉమర్ ఆలీషా శ్రమించుటయే కాక, వీరి మానవునిలో భావ కాలుష్యం, జ్ఞాన సాధన ద్వారా నిర్ములిస్తున్నారని ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరామ కృష్ణ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు పేరూరి సూరిబాబు, ఏ.వి.వి.సత్యనారాయణ, రేఖా ప్రకాష్, దాసరి నాగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఆవరణలో ప్రకృతి వ్యవసాయం చేయుటకు గురువారం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా, ప్రకృతి వ్యవసాయం నిపుణురాలు దాసరి నాగ లక్ష్మి, పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరామ కృష్ణ ప్రసాద్ ఆర్గానిక్ విత్తనాలు పొలంలో చల్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *