Advertisement

బీహార్ ప్రజల మోదీ భక్తి — మనం నేర్చుకోవాల్సిన విలువ: డా. కాశెట్టి కుమార్

హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 07 : “బీహార్ ప్రజలు మోదీ గారిని నాయకుడిగా కాదు, దేశ సేవకుడిగా, ధర్మ పరిరక్షకుడిగా చూస్తున్నారు. వారి అభిమానంలో ఒక ఆత్మీయత, ఒక విశ్వాసం ఉంది. ఇది మన తెలుగు రాష్ట్రాల హిందువులకు ఆదర్శం కావాలి” అని ‘కౌ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు, సామాజిక సేవకుడు డా. కాశెట్టి కుమార్ గారు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ “దేశం నేడు ధర్మపరంగా, సాంస్కృతికంగా ఒక మార్పు దశలో ఉంది. కానీ దురదృష్టవశాత్తూ మన రాష్ట్రాల్లో హిందువులలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం తగ్గిపోతున్నాయి. హిందువులే తమ ధర్మం, దేవుళ్లు, సంస్కృతి మీద విమర్శలు చేయడం ఒక ప్రమాదకర ధోరణి” అని హెచ్చరించారు.

హిందువుగా పుట్టడం గొప్ప విషయం కాదు; హిందుత్వాన్ని గౌరవించడం గొప్పతనం – డా. కాశెట్టి కుమార్ గారు అభిప్రాయపడ్డారు

1. మతనిరపేక్షత పేరుతో హిందువులను తక్కువ చేయడం,

2. ప్రభుత్వాలు దేవాలయాల ఆస్తులపై నియంత్రణ సాధించడం,

3. దేశ సరిహద్దులను దాటిన వర్గాలను ఓట్ల కోసం సమర్థించడం — ఇవన్నీ మన ఆధ్యాత్మిక సంస్కృతికి ముప్పు.

అదే సమయంలో ఆయన స్పష్టం చేశారు — “ ఇది ఎవరి మీద ద్వేషం కాదు. కానీ మన విలువలు, మన ధర్మం పట్ల గౌరవం చూపించకపోతే, భవిష్యత్తులో మన సంతతి మతరహిత సమాజంలో దారి తప్పిపోతుంది.”

 “మోదీ గారిని దేవుడిగా చూడమని కాదు, ఆయన సేవాభావం మనలో ఉండాలని కోరుతున్నాను.” డా. కాశెట్టి కుమార్ అన్నారు

“హిందువుగా మన బాధ్యత ధర్మరక్షణ. అది మతం కాదు, మన సాంస్కృతిక స్వరూపం. బీహార్ ప్రజల మాదిరి భక్తి, గౌరవం, ఆత్మవిశ్వాసం మన తెలుగు భూమిలో మళ్లీ పుడితేనే భారతం పునర్జీవిస్తుంది.”

– సింహగర్జన న్యూస్ ప్రత్యేక నివేదిక
( డా. కాశెట్టి కుమార్ గారి అభిప్రాయం వ్యక్తిగతమైనది. ఇది ఆయన సామాజిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *