Advertisement

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

– కీలకపాత్ర పోషించిన పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి

– ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రెడ్డిల ప్రచార హోరును ప్రశంసించిన మంత్రులు

హైదరాబాద్, సింహగర్జన సంపాదకుడు, డా సునీల్ కుమార్ యాండ్ర, నవంబర్ 14 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంతో రాష్ట్రం అంతటా సంబరాలు జోరందుకున్నాయి. జూబ్లీహిల్స్ గడ్డ సీఎం రేవంత్ రెడ్డి గారి అడ్డ అని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కార్యకర్తలు అంబరాన్నంటిన ఆనందోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోరబండ డివిజన్ ఇంచార్జ్, పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి, యూసఫ్‌గూడా డివిజన్ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డిలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి, అలాగే కార్పొరేషన్ చైర్మన్‌లు ప్రత్యేకంగా అభినందించారు.

గత 25 రోజులపాటు అత్యవసర పరిస్థితులు తప్ప పాలకుర్తి నియోజకవర్గానికి రాకుండా, పార్టీ పిలుపు మేరకు ఇద్దరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో పనిచేశారని పేర్కొన్నారు. ఒకరు బోరబండ డివిజన్, మరొకరు యూసఫ్‌గూడా డివిజన్లో ప్రజలను నేరుగా సంప్రదిస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించారని వారు అన్నారు. ఎమ్మెల్యే దృఢసంకల్పం, కృషి, ప్రజలతో నేరుగా మమేకం కావడం నవీన్ యాదవ్ విజయంలో కీలకపాత్ర పోషించగలిగారని మంత్రులు అభినందించారు. ఈ విజయంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం మరింత బలపడిందని వారు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకుని, విజయోత్సవాలను ఘనంగా జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *