- తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు పిలుపు
ఏటూరునాగారం డివిజన్, సింహాగర్జన ప్రతినిధి, నవంబర్ 19 : తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క- సారాలమ్మ రెండేళ్లకు ఒకసారి జరిగే ఆదివాసీ జాతరలో 2006 నుండి ప్రతి జాతరకు మేడారం కేంద్రంలో ఆదివాసీ తెగల సమ్మేళనం ఆదివాసీ సంఘాలు జరపడం ఆనవాయితీగా వస్తున్నదని, అదే విధంగా 2026 జనవరిలో జరిగే సమ్మక్క- సారాలమ్మ జాతర సందర్భంగా జనవరి నెల 7వ తేదీనాడు ములుగు జిల్లా ఆదివాసీ సంఘాల జాక్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ప్రజలు, ఆదివాసీ సంఘాలు తెగల సమ్మేళనంలో పాల్గొనాలని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం మేడారంలో సమ్మక్క – సారాలమ్మ గుడి నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా చెపడుతుంటే, ములుగు జిల్లాలోని కొందరు అధికారులు పనిగట్టుకొని స్థానిక గుడి పూజరులకు, స్థానిక మంత్రి సితక్కకు చెడ్డపేరు తెచ్చేవిదంగా జాతరను విఫలం చేసే ప్రయత్నంలో భాగంగా గుడి శిల్పకారులకు బాడ్జ్ నుండి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ములుగు జిల్లా జాక్ చైర్మన్ దబ్బకట్ల సుమన్, ఆదివాసీ విద్యార్థి సంఘం (ఏ.ఎస్.యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్నిబెల్లి గణేష్, మహిళ జిల్లా చైర్మన్ చేలా శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply