- ఇడెం స్వరూప స్మారక సేవా సంస్థ సేవా కార్యక్రమాలకు ప్రశంసలు
వెల్లంకి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 21 : తెలుగు సినీ దర్శకుడు యం.వి.సతీష్ కుమార్ నేతన్నల జీవితం పై రూపొందిస్తున్న డాక్యుమెంటరీ కోసం ఇటువలే వెల్లంకి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టి.యం.ఆర్ హ్యాండ్లూమ్స్ అధినేత మరియు ఇడెం స్వరూప స్మారక సేవా సంస్థ అధ్యక్షుడు ఇడెం రాధ శ్రీనివాస్ ని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో శ్రీనివాస్ నేతన్నల కష్టం, హ్యాండ్లూమ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి అవసరమైన సహకారం వంటి అంశాలను వివరంగా వెల్లడించారు. విద్యార్థులకు నిరంతర సహాయం అందిస్తున్న ఇడెం స్వరూప స్మారక సేవా సంస్థ కార్యకలాపాలను దర్శకుడు సతీష్ కుమార్ ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే సంస్థ చేపడుతున్న “యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర పంచాయతీ రాజ్ సమాచార దర్శిని” అనే రాబోయే ప్రాజెక్ట్‌పై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని చేనేత వ్యాపారస్తులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని, ఇలాంటి కీలక సేవా కార్యక్రమం సంస్థ ఆధ్వర్యంలో జరగడం విశేషమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఇడెం రాధ శ్రీనివాస్ దంపతులు దర్శకుడు యం.వి సతీష్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు.















Leave a Reply