- సినిమా వారికి 90 శాతం వరకు బ్యాంకుల రుణాలు
- నటులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లకు ప్రత్యేక వీవీఐపి పాసులు
- సినెటేరియా మెగా రియల్ ఎస్టేట్ షో డిసెంబర్ 27, 28 తేదీలలో
హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 27 : ప్రముఖ బ్రాండింగ్ సంస్థ సినెటేరియా మీడియా వర్క్స్ సినీ పరిశ్రమ మరియు వ్యాపారస్తులకోసం ప్రత్యేకంగా “సినెటేరియా మెగా రియల్ ఎస్టేట్ & లక్జరీ ఎక్స్ పో 2025” నిర్వహిస్తోంది. జూబిలీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో డిసెంబర్ 27, 2025 నుంచి డిసెంబర్ 28, 2025 వరకు నిర్వహించనున్న ఈ మెగా రియల్ ఎస్టేట్ & లక్జరీ ఎక్స్ పో ఈవెంట్ కు ప్రముఖ మీడియా సంస్థ లు ద టైమ్స్ ఆఫ్ ఇండియా, టి-న్యూస్, మెట్రో టీవీ, డైలీ హిందీ మిలాప్, చలన చిత్రం – డిజిటల్ మ్యాగజైన్ సంస్థలు మీడియా భాగస్వాములుగా ఉన్నాయి.
సినెటేరియా మెగా రియల్ ఎస్టేట్ & లక్జరీ ఎక్స్ పో 2025 సినిమాలకు బ్రాండింగ్ ద్వారా సహకారాన్ని అందిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్, జెవెలరీ, ఆటోమోబైల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ & ఫ్యాషన్ సంస్థలు ఈ ప్రత్యేక “సినెటేరియా రియల్ ఎస్టేట్ & లక్జరీ ఎక్స్ పో 2025″లో పాల్గోనున్నాయి. ప్రముఖ లగ్జరీ విల్లాలు, అపార్ట్ మెంట్, ఇండిపెండెంట్ ఇల్లు, ఇళ్ల స్థలాలు, ఫాం హౌజ్ లు, రిసార్ట్ వెంచర్లు ఈ ఎక్స్ పోలో పాల్గొంటున్నాయి. అలాగే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, ఈవీ స్కూటర్, బంగారు నగల వ్యాపారస్తులు, బ్యూటీ మరియు ఫ్యాషన్ కు చెందిన పలు సంస్థలు ఈ మెగా ఎక్స్ పోలో పాల్గొంటున్నాయి.
- సినిమా వారికోసం – ఉచిత “వి.వి.ఐ.పి. గోల్డెన్ పాస్”
ఈ “సినెటేరియా మెగా రియల్ ఎస్టేట్ & లక్జరీ ఎక్స్ పో 2025” పాల్గోదలచిన సినీ పరిశ్రమ & టెలివిజన్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు, డిస్ట్రిబ్యూటర్ల కోసం సినెటేరియా ప్రత్యేకంగా వి.వి.ఐ.పి. గోల్డెన్ పాస్ లను ఉచితంగా అందిస్తోంది. నటీ నటులు మరియు సెలెబ్రిటీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ వారిని ఏర్పాటు చేయడంతోబాటు, ప్రత్యేకమైన వి.వి.ఐ.పి లాంజ్ ను ఏర్పాటు చేస్తోంది. అలాగే వి.వి.ఐ.పి. గోల్డెన్ పాస్ ద్వారా ఎక్స్ పోను సందర్శించే ప్రతి ఒక్కరికీ హై-టీ, స్నాక్స్ ఉచితంగా ఇవ్వడంతోపాటు పలు బహుమతులు అందిస్తోంది.
- సినిమా వారికి 90 శాతం ఇంటి ఋణాలు
సినిమా పరిశ్రమ, టెలివిజన్ మరియు ఇన్స్ టాగ్రాం/యూట్యూబ్ స్టార్లుగా కొనసాగుతున్న వారికి బ్యాంకులు 90 శాతం వరకు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం పలు జాతీయ మరియు ప్రైవేటు బ్యాంకులు “సినెటేరియా మెగా రియల్ ఎస్టేట్ & లక్జరీ ఎక్స్ పో 2025″లో తమ బ్యాంకు స్టోరీస్ ఏర్పాటు చేస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఖచ్చితమైన మినిమం ఆదాయం ఉన్నవారికి కూడా ఇల్లు, అపార్ట్ మెంట్ లో ప్లాట్లు కొనుగోలుకు బ్యాంకులు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.
గమనిక : వి.వి.ఐ.పి. గోల్డెన్ పాస్ కోసం పోస్టర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఫోన్ నెంబర్ 8712217555 ద్వారా సంప్రదించవచ్చు.
















Leave a Reply