Advertisement

గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేసే సిపిఎం అభ్యర్థి కుంచం ఇందిర నరసయ్యను గ్రామ సర్పంచిగా గెలిపించండి

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 12 : నరసింహులగూడెం గ్రామ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే నరసింహులగూడెం గ్రామ సీపీఎం సర్పంచ్ అభ్యర్థి కుంచం ఇందిర నరసయ్య ఉంగరం గుర్తుకు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. నరసింహులగూడెం గ్రామ సిపిఎం సర్పంచ్ అభ్యర్థినీ మరియు వార్డు సభ్యులను గెలిపించాలని కోరుతూ ఈ రోజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరసింహులగూడెం గ్రామ అభివృద్ధి సీపీఎం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగి, ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో సిపిఎం పార్టీ అగ్రభాగంలో ఉందన్నారు. సిపిఎం సర్పంచిగా గెలిస్తే అవినీతికి తావు లేకుండా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుందన్నారు.

సిపిఎం పార్టీని ఓడించేందుకు గ్రామంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ అనైతిక పొత్తు కుదుర్చుకోవడం సిగ్గుచేటని అన్నారు. నీతిగా, నిజాయితీగా ప్రజల కోసం పోరాటం చేసే వాళ్ళను గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ప్రజలకోసం పోరాటాలు నిర్వహించి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన చరిత్ర ఎర్రజెండకే ఉందన్నారు. అమరవీరుల స్పూర్తితో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని అన్నారు. సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి, సర్పంచి అభ్యర్థి కుంచం ఇందిర నరసయ్య, సిపిఎం అనంతగిరి మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ, న్యాయవాది ఉయ్యాల నర్సయ్య, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి జూలకంటి కొండారెడ్డి, సిపిఎం మండల కమిటీ సభ్యుడు సోమపంగు నర్సయ్య, శాఖా కార్యదర్శులు మారం వెంకటరెడ్డి, మొగిలిచెర్ల సీతారాములు, నందిపాటి శేఖర్, బొంత స్వరూప, వార్డు అభ్యర్థులు ఉబ్బపెల్లి నాగమణి, కొప్పుల నారాయణ, సోమపంగు గురవయ్య, జూలకంటి రాములమ్మ, మొగిలిచెర్ల నాగమ్మ, జూలకంటి విమలమ్మ, షేక్ ఫర్వీన్ బేగం, ఉయ్యాల పావని, సోమపంగు రేణుక, మొగిలిచెర్ల శివరాజు, నాయకులు పిడమర్తి అబ్రహం, ఏలుగురి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *