Advertisement

తెలుగు ఐకాన్ అవార్డ్స్ 2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, జూలై 19 : ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రచారం మీడియా, ఎంఎన్ సెలబ్రిటీస్ అండ్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న “తెలుగు ఐకాన్ అవార్డ్స్ 2026” పోస్టర్‌ను రాష్ట్ర నీటిపారుదల, ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు మరియు ఓటీటీ రంగంలోని ప్రతిభావంతులను సత్కరించే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ప్రచారం మీడియా వ్యవస్థాపకుడు & సీఈఓ ఎండీ నాయుడు మాట్లాడుతూ ఆగస్టు 30, 2026న హైదరాబాద్‌లో జరగనున్న తెలుగు ఐకాన్ అవార్డ్స్ 2026ను తెలుగు సినిమా మరియు ఓటీటీ రంగానికి ప్రతిష్టాత్మక అవార్డు వేదికగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *